మన్నించమ్మా

మన్నించమ్మా

రచయిత:విజయ మలవతు

ఏదో తెలిసి తెలియక చేసిన 
చిన్న చిన్న పొరపాట్లను 
పెద్ద మనసుతో క్షమించమ్మా..

లోకాన్నేలే జగజ్జననివే నీకు తెలియనిదేముందమ్మా
తెలిసే చేస్తున్నామో తెలియకనే చేస్తున్నామో
తెలియనితనంతో చేసి భంగపడుతున్నామో
మాది తొందరపాటో, గ్రహపాటో తెలియకుందమ్మా…

లోకానికి నచ్చినట్లుగా ఉండలేక 
మనసుకు సర్ది చెప్పుకుని 
భరించలేని ఆంక్షల నడుమ 
సతమతమయ్యి వసిస్తున్నాం 
అందరూ ఉన్న అనాథల్లా…

మమ్ము ఈ లోకానికి ఒంటరిగా పంపి 
దిక్కు తోచని సమయంలో చేసే 
మా అపచారములను పెద్దమనసుతో 
మన్నించి తప్పు కాయవమ్మా 
ఇకపై ఏ ఉపపాతకం చేయమమ్మా…

మాకై మేము చేసిన అపరాధములకై 
లోకనాయకుడే మాకై
మా తండ్రి స్థానంలో చేయు బుజ్జగింపులు 
ఆలకించి చల్లని చిరు మందహాసం 
ఇటు రువ్వమ్మా…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!