హోళీ

హోళీ..

హోళీ..హోళీ.

హోళీ హోళీ…

రంగుల హోళీ

రమ్యము హోళీ…

 

కురిసేను వర్షము

రంగునీళ్లతో…

తడిసేను తనువులు

తన్మయత్వమున…

 

మంచి చెడుల

మర్మము హోళీ…

చెడుపై మంచికి

విజయం హోళీ…

 

అగ్ని పునీతం

ప్రహ్లాదం…

ఆహుతి స్వాహం

హోలీకం…

 

కపటబుద్దితో కప్పుకున్నను

కుటిల బుద్దితో పట్టుకున్నను…

హరి నామముతో తారు మారులై

దగ్దమయ్యెగా హోలిక నాడు…

 

ఆ దహనము మళ్ళీ

చూడుము నేడు…

 

సంతసముగా..

నాట్యములాడుచు 

ఇంద్రధనస్సులా

రంగుల మునుగుతూ

 

ఒకరిపై ఒకరు

పిచికారి జల్లుతూ

ప్రపంచమంతా

రంగులమయమై…

 

హోళీ..హోళీ…

హోళీ నేడే…

రచయిత:: మేడిశెట్టి యోగెశ్వరరావు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!