నాలోని వర్ణాలు
అరవిచ్చిన మందారమా!
సొగసైన సింధురమా!
మరుమల్లెల మకరందమా!
దవళ కాంతులు విరజల్లె మనోచంద్రమా!
ఏమని పిలువను నిను! నా మనో నేత్రమా!
నాలోనే ఉంటూ
నా ఊనికే నీవంటూ
ఒంటరిగా నీతో జతకూడి
ప్రకృతిలో మునిగి పరవశించే వేళ
ఇంద్రధనుస్సు వర్ణాలే
నా మదిని మురిపించే వేళ
ప్రశాంత చిత్తమే నా దరి చేరగా
నాతో రంగుల కేళి ఆడగా
హోలీ రే హోలీ…
హోలీ రే హోలీ…
రచయిత:: సావిత్రి తోట “జాహ్నవి”