నేటి రామ రాజ్యం

🙏నేటి రామ రాజ్యం🙏

రచన:: విజయ మలవతు

యాగఫలముగా జనియించిన రామ లక్ష్మణ

భరత శత్రుజ్ఞుల మధ్య సోదర ప్రేమకు నిదర్శనం రామరాజ్యాన….

ఆస్తి పాస్తులకై ప్రాణాలే బలి కోరుకునే సోదరులే నేటి కలియుగ జగతిన….

 

జ్ఞాన సముపార్జనకై రాజభోగాలు విడచి

గురుకులానికేగిన బాల రాముడు ఆ కాలాన..

కరోనా రక్కసి ధాటికి  గడప దాటని శిష్యుల పంధా నేటి యుగాన..

 

తండ్రి మాటకై రాజ్య పట్టాభిషేకాన్ని విడనాడి

కానల కేగిన రామచంద్రుడు ఆ కాలాన..

తల్లిదండ్రుల సర్వస్వాన్ని దోచుకొని

వృద్ధాశ్రమాల పాలు చేస్తున్న బిడ్డలు నేటి జగాన..

 

ఏకపత్ని వ్రతునిగా ఆదర్శ పురుషుడుగా

నిలచిన సీతారామచంద్ర ప్రభువు ఆ కాలాన

పతి పత్ని ల సంబంధ బాంధవ్యాలకు

నిర్వచనాన్ని కొత్తగా చూపుతున్న జంటలు నేటి కలియుగాన..

 

రాతిని నాతిని చేసిన జగదభిరాముడు ఆ కాలాన

పునీతను పతితగా మారుస్తున్న ఆకలి పులులు నేటి యుగాన..

 

ఎన్నని చెప్పను రామరాజ్యానికి కలియుగానికి పరమ వ్యతిరేక రీతి,

ఈ కలియుగాన జనుల తీరని..…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!