దశరథ మహారాజు పెళ్లి

దశరథ మహారాజు పెళ్లి

రచన::కూచి భొట్ల వెంకట లక్ష్మీ

శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శేష తల్పము పై పవళించి ఉండగా శ్రీ గణపతి ఇతర ప్రమథ గణాలు దేవతలు వెళ్లి రాక్షస సమాహారం చెయ్యి డానికి శ్రీ రామునిగా అవతరించమని ప్రార్థన చేశారు, అందుకు చిరునవ్వుతో సరే
దశరథ మహారాజు కడుపున పుడతాను కౌసల్య మాతతో వివాహం జరిపించండి అని చెప్పి పంపాడు. 

ఈ విషయం రావణ బ్రహ్మకు తెలిసి దశరథుడిని పట్టు కెళ్ళే ప్రయత్నం చేశాడు.అప్పుడు దశరథుడికి ఆడవేషం వేసి బయటకు వెళ్లకుండా దాచారు.అలా దశరథుడిని కాపాడారు

అయితే కౌసల్య విషయంలో రావణాసురుడు అమే ఆడుకుంటుంటే రాక్షస మాయతో పట్టి పెద్ద పెట్టెలో పెట్టీ సముద్రంలో వదిలేశాడు.

ఈ విషయం తెలుసుకున్న దేవతలు మనకు శ్రీ గణపతి తప్ప వేరే దిక్కు లేరని తలచి
గణపతిని ప్రార్థించారు .

అప్పుడు గణపతి తన తెలివితో ఆ పెట్టే దశరథ రాజు నగరం వద్ద గట్టుకు చేరేలా చేశాడు 
ఈ లోగా దశరథ రాజుని సముద్రం ఒడ్డున పెద్ద పెట్టె వచ్చింది చూడమని పంపాడు.ఆ వెంటనే సైన్యంతో దశరథ రాజు వెళ్లి పెట్టెను బయటకు తీసి మూతను తీశారు 

అందులో సర్వాంగ సుందరంగా అలంకరించి ఉన్న యువతి కనిపించింది, అప్పుడు గణేశుడు రెండు. దండలు తెప్పించి గాంధర్వ వివాహం చేశాడు  అందరూ అచ్చార్య పోయారు సాక్షాత్తు గణపతి దగ్గర ఉండి కౌసల్యకు దశరథుడికి పెళ్లి చేసి ఇద్దరిని అదే పెట్టెలో పెట్టి మళ్లీ నీళ్ళల్లో
వదిలేయమని చెప్పాడు. ఇదే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అన్నట్లు అంతా గణపతి మాయతో జరిగిపోయింది.

రావణ బ్రహ్మ చెయ్యగలిగింది ఏమి ఉంది కాల క్రమంలో శాంతదేవి అనే పేరు గల పుత్రిక వీరికి జన్మించింది ఆమే రాచరికం ఇష్టత లేదు సామాన్యంగా ఉండి ఋషి సేవ చేసేది ఆమెను యుక్త వయస్సు రాగానే  ఋష్యశ్రుంగునికి ఇచ్చి వివాహం చేశారు .

అయితే రాక్షస సంహారానికి రాముని పుట్టుకతో అవసరము అందువల్ల పుత్ర కామేష్టి చెయ్యమని దేవతలు అడిగితే దశరధుడు ఒప్పుకోలేదు కానీ అల్లుడు వచ్చి నచ్చ చెబితే సరే అన్నాడు.కానీ ఆయన మనసులో శ్రావణ కుమారుని తల్లి తండ్రి పెట్టిన శాపం జ్ఞాపకం వచ్చేది .

శ్రీ మహా విష్ణువు తన కడుపున పుట్టే యోగం ఉంది కదా అని పుత్ర కామేష్టి చేసి పాయసం తిన్నారు కౌశల్య కడుపున శ్రీ రాముడు జన్మించాడు కైకేయికి భరతుడు సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు

సీత మిథిలలో జనకునికి నాగలితో భూమి దున్నుతుండగా పెట్టెలో దొరికింది.
ఇలా పుట్టిన శ్రీ నారాయణ లక్ష్మిదేవులు అల్లారు ముద్దుగా పెరిగారు. 

శ్రీ రాముడు వశిష్టుని వద్ద సకల విద్యా పారంగతుడు అయ్యాడు.విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణ నిమిత్తము అడవులకి పంపమనగ దశరధుడు ఒప్పుకోలేదు విశ్వామిత్రునికి కోపం రాకుండా నచ్చ చెప్పి
దశరథుని ఒప్పించి రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళి అయన వద్ద ఎన్నో విద్యలు మంత్ర తంత్ర ఇతర మహా విద్యలు, శాస్త్రాలు తెలుసుకుని రాక్షస సంహారం చేసి యాగ రక్షణ చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి అయోధ్యకు బయలుదేరగా విశ్వామిత్రునికి సీతా స్వయంవరం ఆహ్వానం వచ్చి శ్రీ రామునికి స్వయంవరం సమయం ఆసన్నమైనదని
వారిరువురిని వెంట పెట్టుకొని సీత స్వయంవరానికి వెళ్ళాడు అందరూ ఎంతో సంతోషించారు .

అతిరథ మహారథులు రావణుడు ఆసీనులై ఉన్నారు.అందరూ మనసులో ఆందోళనతో ఉన్నారు రాముని రాక కోసం ఎదురు చూస్తున్నారు .

నీల మేఘ ఛాయతో మెరిసిపోతూ ధనుర్బాణాలు
పట్టుకుని నార బట్టలతో ప్రవేశించిన యువకుని అతనితో లక్ష్మణుడు రాక చూసి ఆనంద పడ్డారు

విశ్వామిత్రుని ఆజ్ఞతో శివధనస్సు అవలీలగా విరిచి సీతను వివాహమాడెను.జనకుడు ప్రజలు దేవతలు మునులు అందరూ ఎంతో అనందపడిరి. దేవతలు ఆకాశం నుండి పుష్ప వర్షం కురిపించారు. 

ఈ వార్త దశరథునికి పంపి రప్పించారు మిగిలిన తన సొంత కుమార్తెలను మిగిలిన ముగ్గురుకు ఇచ్చి డెబ్భై యోగాల ముత్యాల పందిరి లో
రెండు రాజ్యాల ప్రజలు ఆనందపడేలా వివాహం జరిపించారు. 
 ఆ శుభ ముహూర్త రోజు మనకు శ్రీ రామ నవమి వాడ వాడ లా అందరూ ఆసక్తి కరంగా ఈ పండుగ చేస్తారు పానకం పంచి పెడతారు. గతంలో తొమ్మిది రోజులు ఘనంగా పాటలు నృత్యాలు కచేరీలు నాటకాలు చేస్తూ అతి ఘనంగా చేసేవారు.
శ్రీ రాముడు అన్ని కాలాలకు ఆదర్శ మూర్తి అవతార మూర్తి
సీత కళ్యాణ సౌభాగ్యము
శ్రీరామ కళ్యాణ వైభోగమే
అందుకే ఈ కళ్యాణోత్సవానికి
అందరూ ఆనందంగా పూజలు చేసి, స్తోమత కొద్ది పిండివంటలతో నైవేద్యములు పెట్టి భక్తిగా పూజిస్తారు. 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!