డబ్బులున్న పేదవాడు 

డబ్బులున్న పేదవాడు 

రచయిత: ఉదయగిరి దస్తగిరి


కుటుంబం కోసం తాను కొవ్వొత్తిలా
కరిగిపోతూ వెలుగుల పరిమళాలను
పంచేవాడు నాన్న 

నీడలా వెంటే ఉంటూ కొండంత ధైర్యాన్ని
ఇస్తూ కుటుంబాన్ని ముందుకు
నడిపించేవాడు నాన్న 

నడకని, నడతని నేర్పుతూ  జీవితపాఠాన్ని
బోధించే మొదటి గురువు నాన్న 

గుండెల్లో బాధల బడబాగ్నులు ఎన్నున్నా
సడి చేయని సముద్రం నాన్న 

పిల్లలకి ఎక్కడ తక్కువ వస్తుందోనని
తన జోబిలో డబ్బులున్నా కావలిసినవి
కొనుక్కోలేని పేదవాడు నాన్న

తాను బాధ్యతగా నడుచుకుంటూ, పిల్లలకి
బంగారు బాటని పరిచే వాడు నాన్న 

పిల్లల బాధలన్నింటిని ఖర్చు
చేసి సంతోషాలని అందించే కలతలేని
ప్రేమికుడు నాన్న 

అమ్మ అనురాగాన్ని చూపిస్తే
నాన్న నిస్వార్థంగా ఆకాశమంత ఔన్నత్యాన్ని
కలిగి అడిగినవన్నీ  అందించే ‘అక్షయ పాత్ర’ నాన్న. 

You May Also Like

One thought on “డబ్బులున్న పేదవాడు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!