నాన్న- మార్గ నిర్దేశకుడు

నాన్న- మార్గ నిర్దేశకుడు

 

రచయిత: బి.హరి రమణ 

అమ్మ నుదుటి సింధూరమై
అమ్మ పెదవులపై నవ్వు మా నాన్న

నీలి మబ్బుల దొంతరలో సూర్యుడిలా
గాంభీర్యము ముసుగులో ఉన్న హిమగిరి శిఖరం
తన ఎదని పానుపు చేసి 
జోల పాటలు పాడిన నాన్న

సూర్యుడు తూర్పు తలుపులు
తెరుచుకుని రాకముందే
నిద్రలేపి ఎక్కాలు పద్యాలు వల్లె వేయించేి నాన్న

తగిలిన దెబ్బలు జీవితాన 
సమస్యల నుండి బయటపడేసే నేర్పు ఓర్పు కలుగజేయును అంటూ 
ఊరడించి ఓదార్పు భరోసానిస్తూ
మరోవైపు పక్కకు తిరిగి 
 కంటనీరు తుడుచుకునే  భీరువు మా నాన్న

 ఆర్థిక వెసులుబాటు సుడిగుండాలలో పడి
నలిగిపోయే మౌన మహర్షి

తప్పటడుగులు వేయు వేళ 
మా బ్రతుకు శకటాన్ని రాజమార్గాన
పయనింప చేయు పథనిర్దేశకుడు

మా భవితకై అహరహము 
కష్టపడే నిత్య హాలికుడు

 తరువులా ! ఓ మేఘం లా  !
 త్యాగ గుణం ఉండాలని  హితబోధలు
మా మనసులో నింపే దార్శనికుడు మా నాన్న

రేపటి మా జీవితానికై 
కఠిన క్రమశిక్షణా చర్యలను అమలు జరిపే శిక్షకుడు
ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా
 
తాను నొచ్చిన ఇతరులను నొప్పివ్వని 
మనసున్న ధర్మరాజు మానాన్న
ఇప్పటికీ మాకు ఎదురయ్యే సమస్య వలయాల చిక్కులను విప్పే  
మా ఆంతరంగిక మిత్రుడు మా నాన్న

మాకై తన సర్వస్వము ధార పోసి  తనకేమీ
మిగుల్చుకోని దార్శనికుడు

మీరే మా ఇంటి అసలు సిసలైన హీరో….
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను
ముదిమి లో మీకు అమ్మనవడం తప్ప….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!