మొక్కల వేటు ప్రాణానికి చేటు
మెట్రో పట్టణ అభివృద్ధి అని
చెట్లు నరికేస్తూ మరోపక్క
హరితహారం అని కొన్ని మొక్కలు
నాటితే ఇన్నేళ్లు నేల తల్లి పడిన
క్షోభని తీర్చలేము ఆ విలువ
ఇప్పుడు కరోనా కాలంలో
ఆక్సిజన్ లేక అల్లాడుతున్న ప్రజలను
చూసి తెలుసుకునే నాటికి
మూల్యం చెల్లించడం తప్ప ఏమీ
చేయలేని స్థితిలో ఉన్నాము
పర్యావరణాన్ని రక్షించలేని మనం
మనల్ని రక్షించలేని స్థితిలో ప్రకృతి
మనం చెట్లను కొట్టేస్తే ఆక్సిజన్
అందక కరోనా మనల్ని కాటేసింది
రచయిత::హసీనాఇల్లూరి
చాలా బాగుంది హసీనా,👌👌👌👏🏻👏🏻🌹🌹