తెలుగింటి తొలి పండుగ ఉగాది
వచ్చిందమ్మా వచ్చింది..
షడ్రుచుల పండుగ వచ్చింది..
తెలుగింటి తొలి పండుగ
నూతన సంవత్సరాది పండుగ
ప్లవ నామ సంవత్సరంగా
మన ఇంట కాలు మోపే పండుగ
ఆరు రుచులు.. రుచులతోనే
జీవిత పరమార్థని తెలుపును
కుహు కుహు రాగాలతో
ఆహ్లాదకరంగా మొదలయ్యే పసందైన పండుగ
నేడు కరోనా కోరల్లో ఇంటికి
బంధీని చేసిందిలా
తుమ్మినా దగ్గినా
అందరి గుండెల్లో దడ
ఎన్నటికి ఆగుతుందో ఈ
మహామ్మారి మారణకాండ
అందరి రాశి ఫలాలు మారాలి
కరోనా దశ, దిశలు మారి
తుడిచి పెట్టుకుపోవాలి
ఈ ఉగాది రాకతోనైన
కరోనా ‘యుగ(అం)తం’ అవ్వాలి!!
రచన:అలేఖ్య రవికాంతి