షడ్రుచుల ఉగాది
కోయిల మధుర గానాలతో
పచ్చని చెట్ల చిగురాకు సోయగాలతో
మోడు వారిన జీవితాలకు నవీన ఆశలతో
చీకటిలో మగ్గుతున్న కళ్ళకు వెలుగు వసంతాలతో
షడ్రుచుల సమ్మేళన రుచులతో
జీవన వేదాంత శాస్త్రలతో
సమస్త మానవాళికి ప్రకృతి ఇచ్చే వరాలతో
నవ యుగంలో నూతన అనుభవ పాఠాలతో
జీవత యాత్రలో అలసిన ఆశయాలకు క్రొత్త గమ్యాలతో
భవిష్యత్ కలలకు పట్టుదల
రెక్కలను జతచేస్తూ
చిరు నవ్వులు చిందిస్తూ
సమస్త మానవాళికి
అందించాలని వచ్చేసింది
ఈ ఉగాది...
రచన: ఇత్నార్క్