నువ్వు..

రచన – అనీల సందీప్

ఎవరు నువ్వు..
నేనా…నే…ను..నేనే..అవును…
నువ్వు తాడివి అయితే
నీ తలదన్నేది నేనే

నువ్వు మాయవు అయితే
నీ కన్నా పెను మాయను నేనే
నువ్వు మంత్రానివి అయితే
నిన్ను మించిన తంత్రాన్ని నేనే

నువ్వు విషానివి అయితే
ఆ విషానికి విరుగుడు నేనే
నువ్వు ప్రశ్నవి అయితే
ఆ ప్రశ్నకి జవాబు నేనే

నువ్వు గెలుపువి అయితే
నీ ఓటమిని నేనే
నువ్వు గరళానివి అయితే
ఆ గరళాన్ని మింగే శివుడిని నేనే

నువ్వు జీవాత్మవు అయితే
నీలో ఉండే పరమాత్మను నేనే
ఇంక అర్థం కాలేదా
నేను ఎవరో

అవును..నే…ను…నేనే.
నీలో ఉండే నువ్వే నేను

******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!