ప్లవ నామ సంవత్సరాది

“ప్లవ” నామ సంవత్సరాది

  

 “తొలి తెలుగు “ప్లవ” నామ సంవత్సరాది ఈ “ఉగాది”…!!!

 

 “ఉదయించే సూర్యుని కిరణాల తొలి వెలుగులో”,

  “పక్షుల కిలకిల రావాలతో”,

“లేలేత చిగురాకుల చిగురులతో”,,

“వికసించిన పూ పరిమళాలతో”,, 

“కోకిలల సుస్వరాలకు మైమరచి పరవశించే తెలుగింటి ఆడపడుచులద్దిన రంగవల్లులు” తొలి తెలుగు “ప్లవ” సంవత్సరాది

ఈ “ఉగాది”…!!!!

   “విసిగిన గత మనసులో ఆశలు మొలకలై”,

 “షడ్రుచులచే గుండె గూడు ముస్తాబై”,

 “అనందాలతో ఆకాశ గగనంలో తారకలై విహరింప చేసే యుగాది”,,,

  ఈ తెలుగు సంవత్సరాది…!!!

  “రాశుల గీతలు మారి”,

“పట్టిన గ్రహణాలు విడగా”,

“పంచాంగ శ్రవణమే చెవులను చేరి”,

“మంచికి నాంది పలికే తొలి తెలుగు “ప్లవ” నామ సంవత్సరాది”,, ఈ “ఉగాది”…!!!

  

“ముక్కోటి దేవతల దివేనల కుసుమాక్షితలతో”,

“తరించిపోయే పచ్చని పుడమికి నుదుటన తిలకం దిద్దిగా” వచ్చిన తొలి తెలుగు “ప్లవ” నామ సంవత్సరాది “,, ఈ  “ఉగాది” ..!!!! 

                           

  రచన : నరసింహారావు. కాసీమల్ల  ( అక్షరపద్మ )

            
      

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!