షడ్రుచుల సమ్మేళనం

షడ్రుచుల సమ్మేళనం

వసంత ఋతువు ఆగమనం 

తెలుగు తనపు నూతన గమనం

ప్రకృతి ఇంట సరికొత్త  శోయగం

షడ్రుచుల సమ్మేళనం ఈ పర్వదినం

 

లేలేత చిగురుల రుచులెరిగిన కాలం 

కొమ్మ మాటున గండు కోయిల గానం

ఉషోదయపు వెలుగుల శోభాయమానం 

ఆమని మేనికి అందాలద్దే ఉగాది ఆగమనం 

 

మానవ మనుగడలో కష్ట నష్టాలకు ప్రతీక 

ఆరురుచుల ఉగాది పచ్చడి మేలి కలయిక

నయా సంవత్సరాది ఈ తెలుగు యుగాది

గడప గడపన ఆనందాల వేడుక ఈ ఉగాది

             రచన: శ్రీ గురు గొల్లపల్లి 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!