యాభయ్యో వసంతం

యాభయ్యో వసంతం

విడదీయరాని బంధాల మధ్య
వదులుకోలేని బాధ్యతల నడుమ
ఎన్నెన్నో ఆనందాలు
మరెన్నో కష్టాలు అనుభవించి
అలసిన మనసుతో
సొలసిన తనువుతో
యాభయ్యో ఒడిలో అడుగు పెట్టింది ప్రాణం
కనుల ముందు కరిగిపోయిన ప్రేమ కావ్యం
పెళ్ళినాటి సంబరాలు
కొత్తగా చెంత చేరిన జీవిత భాగస్వామి
వలపు రుచులు పరిచయం అవుతుండగానే
తీయని గురుతుగా మరో కొత్త అతిథి ఆగమనం
చూస్తుండగానే వాళ్ల చదువులు, పెళ్లిళ్లు
దాటొచ్చిన మధురమైన జ్ఞాపకాలు
ఇక విశ్రాంతి తీసుకో అన్నట్టు వచ్చిన వృద్ధాప్యపు ఛాయలు
భారాలన్ని దిగిపోయిన వేళ
ఇన్నాళ్లుగా నేను అలసత్వం చూపిన నా భాగస్వామి
నా జీవితం మొదలైన క్షణం నుండి తోడుగా నిలిచిన నా భాగస్వామి
నేనెప్పటికీ నీ చెంతనే అంటూ దరిచేరిన నా భాగస్వామి
కన్నీట ముంచిన జన్మనిచ్చిన వారి నిష్రమణ
అంతలోనే చిరునవ్వులు పూయించిన మనవల రాక
వడలిపోయిన శరీరానికి
ఆశలుడిగిన మనసుకు
ఉపశమనం నేనంటూ ముందుకొచ్చెను నా భాగస్వామి
ఇక రాబోవు వసంతాలన్నీ మా ఆలుమగల సొంతమే

రచయిత::✍️మౌనవీణ

You May Also Like

One thought on “యాభయ్యో వసంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!