శునక పరిణయం

శునక పరిణయం….

 

రచయిత: రామ్ ప్రకాష్

హలో అందరికి భౌ.. భౌ..

అదేనండి నమస్కారమని మా భాషలో చెప్తున్నాను…

నా పేరు బంగారయ్య…

ఏంటీ అలా గుడ్లప్పగించి చూస్తున్నారు…

 

ఇంతకీ ఏంటీ ఇంత బంగారం వేసుకున్నాను అనుకుంటున్నారా….

ఏం లేదండి ఈ మధ్యనే మా పక్క విల్లాలో వుండే

తోక లేని తాయారమ్మని

పార్కులో వాకింగ్ చేస్తూ చూసాను

చాటింగులో మాట కలిపాను

మీటింగులో ముగ్గులోకి దింపాను

చివరికి ఎవరు లేని సమయంలో 

లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం

మాకు సాక్షులు ఎవరనుకున్నారు

వీధి కుక్క బెల్లం బీరకాయ

పిచ్చి కుక్క సోంబేరి సొరకాయ

 

మా పెళ్లి విషయం మా ఇంట్లో తెలిసి 

ముందు కోప్పడ్డారు

మమ్మల్ని విడదీయాలనీ చైన్లతో 

కట్టేసారు కూడా… కానీ 

గోడ దూకి మరి dog rights కమిషన్ కి 

కంప్లైంట్ ఇచ్చాను.. దెబ్బకు దిగొచ్చారు…

ఎంతైనా అల్లుడిని కదా…

మా తయారమ్మ ఇంట్లో వాళ్ళు ఈ బంగారం కట్నంగా పెట్టారు

అందుకే ఇలా వేసుకొని ఫొటోకు ఫోజ్ ఇచ్చాను

పొరపాటున ఇది బంగారమనుకొని 

కొట్టుకుపోదామని మా ఇంటికి వస్తారేమో

మా పళ్ళు చూసారు కదా…

కొరికితే మీకే బొడ్డు చుట్టూ పదహారు ఇంజెక్షన్స్… జాగ్రత్త మరి.

 

సరే ఉంటాను… అసలే కొత్త పెళ్ళికొడుకుని కదా

మీరలా చూస్తుంటే నాకు దిష్టి తగిలేలా ఉంది

వెంటనే మా అమ్మ గాలిపటం గంగమ్మకు ఓ తాయత్తు తెచ్చి

నా వెనుక కాలుకు కట్టమని చెప్పాలి.

నోట్ :
ఈ ఆదివారం… మా  రెసెప్షన్ వేడుక మా ఇంటి పెరట్లో ఉంది…దయచేసి అందరూ రండి.. 
వచ్చేటప్పుడు కానుకలు మాత్రం మర్చిపోకండి
కానుకలు లేనిచో కరవబడును.

You May Also Like

3 thoughts on “శునక పరిణయం

  1. హహహ.. చాలా చాలా బాగుంది..తాయారమ్మ బంగారయ్య పెళ్లి ..👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!