త్యాగానికి మరో రూపం నాన్న

త్యాగానికి మరో రూపం నాన్న

 

రచయిత: పరిమళ కళ్యాణ్

అమ్మ ప్రేమకి ప్రతిరూపం అయితే 

నాన్న త్యాగానికి మరో రూపం

 

నాన్న ఎన్ని బాధలు ఉన్నా,

గుండెల్లో ధైర్యాన్ని నింపుకుని పైకి గంభీరంగా కనిపించే వ్యక్తి!

 

ఎదురుకోలేని కష్టాలను సైతం

కుటుంబం కోసం ఇష్టాలుగా మార్చుకునే ప్రేమ మూర్తి!

 

కన్నీటిని బయటకి కనిపించకుండా 

జీవిత సాగరాన్ని దాటించే నావ నాన్న!

 

అమ్మ కడుపులో పెట్టుకుని మోస్తే

గుండెల మీద మోసేవాడు నాన్న!

 

మన కలల్ని నిజం చెయ్యటం కోసం

తన కలల్ని సైతం వదులుకునే శ్రమైక జీవి!

 

మన భవిష్యత్తు కోసం పైపైకి

కాఠిన్యాన్ని, కోపాన్ని చూపించేవాడు నాన్న!

 

మన గెలుపుకోసం తన ఓటమి కూడా

లెక్క చెయ్యనివాడు నాన్న!

 

తనకంటే తన బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలని

తపించేవాడు నాన్న!

 

తప్పటడుగులు వెయ్యకుండా మన చెయ్యి పట్టుకుని

నడిపేవాడు నాన్న!

 

మన తప్పుల్ని తన తప్పులుగా భావించి

సరిదిద్దేవాడు నాన్న!

 

తన సంతోషాలను, సుఖాలను తన బిడ్డలకోసం

త్యజించేవాడు నాన్న!

 

కష్టనష్టాలలో చెదరని చిరునవ్వుకి

చిరునామా నాన్న!

 

ప్రతి కూతురికి తన తండ్రే ఒక హీరో!

 

నాన్న ఒక ఆసరా!

నాన్న ఒక అండ!

నాన్న ఒక తోడు!

నాన్న ఒక ఆధారం!

You May Also Like

2 thoughts on “త్యాగానికి మరో రూపం నాన్న

  1. Prati okkariki nanna oka super hero andi kani kuturlaku inka pedda hero chala bagundi mi kavitha👏👏👏👏

    1. ధన్యవాదాలు లలిత గారు.. నిజమే నాన్నే ఆడపిల్లలకు మొదటి హీరో😊🤝

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!