సోయగాల ప్రకృతిస్త్రీ
పుడమిలోని సోయగం
మగువలోని స్థిరత్వం..
ఆకాశంలోని విశాలత్వం
పడతిలోని మూర్తిమత్వం..
సుందరవనాలకు ప్రతీకం
స్త్రీ మేని మెరుపు ముగ్ధత్వం..
అరవిరిసిన పూల తీరు
కాంత సున్నితత్వం..
అందరాని జాబిలంటి
మహిళ వ్యక్తిత్వం..
అమరికలో వెలుగులు చిమ్మే
దొరసాని ప్రౌడత్వం..
చిరుజల్లులంటి చిరు ఆనందాలకే
వనిత తనువు పులకరింపు..
సాగరంలా అణువణువు వర్ణింప అలవికాని
నాయకి ఓ అద్భుతం..
ప్రకృతిలోని పరిమళాల గని
యువతి జ్ఞానాల సుగంధం..
వర్ణింపనలవి కానిదే ప్రకృతి స్త్రీలిరువురి
సౌందర్య సోయగాల తీరు మైమరచడం తప్ప..
రచయిత :: విజయ మలవతు
చాలా బాగుంది విజయ గారు👌👏🏻🌹
Super sis
సూపర్ అండి👏👏