నిగూఢాల నిధి
అలసిసోలసే బ్రతుకుబండైన
ఆకాశమంత ప్రేమ తనలో..!
భరించలేని సమస్యల మధ్య కూడా
భూదేవి అంత ఓర్పు తనలో..!
తనవారి జోలికొస్తే
తాళలేని నిప్పులు కురిపించు రౌద్రం తనలో..!
నీరు ఏ పాత్రకు ఆ రూపం దాల్చినట్టు
నలుగురిలో మమేకమయ్యే గుణం తనలో..!
ఊపిరి నిలిపే ప్రాణ వాయువులా
ఊరటనిచ్చే శాంతం తనలో..!
ప్రేమిస్తే పంచభూతాల ప్రేమ తనలో
పొరపాట్లు చేస్తే పంచభూతాల రౌద్రం తనలో….
అంతా తెలిసిన ఏమి తెలియని
అంతు చిక్కని శూన్యం లా
నిగూఢాల నిధి ఆమె…
రచయిత :: శాంతి కృష్ణ
very nice…
చాలా బాగుంది బాగా రాసారు. నిజంగా స్త్రీ ఒక నిధి
ఆమెలో చూడగా చూడగా ఎన్నో అద్భుతాలు బయటపడుతూ ఉంటాయి. ప్రేమ వాత్సల్యం దయ అవసరం వచ్చినప్పుడు
కోప్పడ్డం అన్ని రకాల ఎమోషన్స్ ఆమెకి మాత్రమే సొంతం.
చాలా బాగుంది. 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼😊😊