రచన – చల్లా సరోజినీ దేవి
ఏ రీతిని నిను కొలువ గలనో శివయ్యా?
పూలన్నీ తెచ్చి పూజలు చేయగా తలచితిని
అయితే పువ్వు పువ్వున నీ రూపమే కాంచితిని
జలాలన్నీ తెచ్చి అభిషేకించ బోయితిని
ప్రతి బిందువులో నీ నవ్వులే గలగలమన్నాయి
మారేడు దళాలు తేవాలని చూడగా
మళ్లీ మళ్లీ నీ కన్నులే కనిపించాయి
త్రినేత్రధారీ, త్రిశూలపాణీ, నీలకంధరా,
నీవు లేని చోటే లేదు గదయ్యా!
భవ బంధాలను ద్రెంచి ,
నీ కరుణా కటాక్షాలు ప్రసాదించి
మోక్ష మీయగా వేడుచుంటిని
నన్ను గాన రావయ్యా శివయ్య!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻