శివ శంభో

రచన – బి.హరిరమణ

శివా…శివా….శివా
శంభో హర హరా శివా !

నీ నామమే కదా
సర్వపాపహరణం
త్రినేత్ర మహేశ్వరా
మోక్షమిచ్చే నీదు నామం

జగతి నడిపించు శివ తత్వమే
అంతా శివోహం… నిరాకార రూప
ప్రణవ స్వరూపా ఓంకార బీజాక్షరా
పంచాక్షరీ మంత్ర స్వరూపా శివా

ఆది అంతము లేని సర్వాంతర్యామి
బూడిదిచ్చేవాడినేది
నిరాడంబరతత్వరూపా
పార్వతీవల్లభా శివా !

అర్థనారీశ్వరా ! ఓం నమ నమశ్శివాయ
అన్న చాలు సచ్ఛీలత వైపు పయనం
మదిలోని కల్మషాలు తొలగు కరుణతో
భక్తులను బ్రోచే భోలా శంకరా

దిగంబర రూపా నీవేగా
మాకుముక్తి సాధనo
శివా….శివా…శివా… శివ
అంతా శివోహం…. శివోహం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!