రచన – మంజీత బందెల
ఏమిటి నీ లీలలు
అర్థం కావు నువ్వు రాసే తలరాతలు
అలంకారాలు ఎరగని దిగంబరివి
స్మశానంలో తిరిగే విశ్వేశ్వరుడివి
మహిళకు గౌరవమిచ్చిన అర్థనారీశ్వరుడివి
సృష్టి రహస్యం సృష్టించిన సర్వేశ్వరుడివి
కోరిన కోరికలు తీర్చే మహేశ్వరుడివి
మీసాలతో దర్శమిచ్చే మల్లన్నవి
బిల్వపత్రం సమర్పిస్తే మురిసే ఈశ్వరుడివి
ఓ కైలాసవాస!
నువ్వు ఆడే ఆటలో మేమంతా పావులమే!
చివరకు నిన్ను చేరే చిరు ప్రాణులమే!!