శిల్పి… శిల్పము.. జీవిత సత్యము

శిల్పి… శిల్పము.. జీవిత సత్యము

 

రచయిత:బుజ్జమ్మ

 

తన సతి అలక తీర్చ వశము కాని వేళ…

పని చేయు మనసు పరధ్యానంలో నుండగా…

రాతి బొమ్మ కూడా రమ్యముగా చెక్కెనేమో…

మనసున రమించే తన దేవేరి ధ్యాసలో

ఆహా ఆ శిల్పికి ఎంతటి అనురాగమో కదా సతిపై 

అని అచ్చెరువొందుతూ.. ఆ శిల్పము గాంచిన వేళ..

మదిన సాక్షాత్కరించే ఓ జీవన సారం…

మాధవుడికే తప్పలేదు సతి అలక తీర్చుట.. 

ఇక నేను అలిగిన తప్పేమి అని 

నా పతిదేవునికి జీవిత సత్యం బోధించి… పిమ్మట

కనులు ముందు చూపితిని… తన ధర్మమును.

 

You May Also Like

2 thoughts on “శిల్పి… శిల్పము.. జీవిత సత్యము

  1. Nijame పాపం దేవుడికి కూడా సతి అలిగితే బుజ్జగించాటం తప్పలేదు ఇంకా మనం ఎంత…👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!