స్వామి

స్వామి…

 

రచయిత: తాళ్ళ శ్రీకాంత్

 
స్వామి…
నీకై తాత్విక చింతనతో…
భవ బంధ విముక్తి చెంది
అన్నింటినీ వదులుకునేందుకు సిద్ధపడుతూ
నీ దర్శనం కోసం నిరీక్షిస్తుంటే
నువ్వేమో…మా అమ్మ 
అలక తీర్చే ప్రయత్నం చేస్తున్నవా స్వామి

సమస్తాన్ని శాసించి పరిరక్షించే నువ్వు
సతీ సరస బుజ్జగింపుతో…
విరహపు విమోచన ప్రయత్నం చేస్తున్నావా

గృహస్థాశ్రమ ధర్మాన్ని
సమపాలుగా అనుభవిస్తు‌ ఆనందంగా జీవించమని 
చెప్పకనే చెబుతూ…
చెలి సాంగత్యంలో సంతోషమయ సమయానికై
ఆలితో… అలా సరదాగా కొలువైన 
ఏకాంత సమయం ఆనందిస్తున్నావా

ఏదేమైనా మీ కళారవింద స్వరూపాలన్ని 
జగతికి ఏదో…ఒక జాగృతమయ ఆలోచన రేకెత్తించేది అయ్యి ఉంటుందిలే దేవా.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!