అలుపు – వలపు

 అంశం : వయ్యారాల జాబిలమ్మ అలిగిన వేళ
             ఉత్తరాన సూర్యుడు ఉలికిపడెనేల

 అలుపు – వలపు

రచయిత: సత్య కామఋషి ‘ ఏకలవ్య ‘

 

వెన్నెల వెలుగులు పంచగా నెలరాజు 

నిశీధి తెరల మాటున దోబూచులాడే వేళ 

 

రవితో పోటీపడి ఇంటిని చక్కదిద్దుతూ 

అలసిన అందాల ఇంతి ఆదమరపు కోరెనే.. 

 

తలార స్నానమాడి తడియారని తనువుతో

లిప్తపాటుగా, అట వాలగా…రెప్పవాలగా… 

 

చెదరిన వలువల తడిపొడి సొగసుల

నెచ్చెలి అందాలు ఊరిస్తూ కనువిందుగ

అల్లరి వయసులో తుంటరి తపన రేపగా., 

 

విరహపు విరుపుల వేగుతూ,  గడసరి 

చెలికాడు, చెంతకు చేరి చెలి చెక్కిళ్ళను

చిలిపిగా తడుముతూ గిలిగింతలనిడగా

నడుమొంపులను మురిపెముగా నిమరగా.. 

 

చెదిరిన కలుత నిదురలో చిర్రుబుర్రులాడుతూ 

వయ్యారాల జాబిలమ్మ అలిగిన వేళ..కురిసే

ఓరకంటి రుసరుసలను తాళలేక సఖుడు

చిన్నబుచ్చుకొన్న బుంగమూతి పసిపాపడై..

చల్లబడిన ఉత్తరాన సూర్యుడై, ఉలిక్కిపడెనే..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!