నీ పదాల మాయలో

 అంశం : వయ్యారాల జాబిలమ్మ అలిగిన వేళ
             ఉత్తరాన సూర్యుడు ఉలికిపడెనేల

నీ పదాల మాయలో

 

రచయిత: శాంతి కృష్ణ

           ఆహ్లాదకరమైన సూర్యోదయం.
    ఆమె మనసు మాత్రం అసహనం తో మండిపోతుంది..!
ప్రతిరోజూ ఉదయం కలిసి వ్యాయామం చేస్తూ, వారి బంగారు భవిష్యత్తు కోసం ఊసులాడుకుంటూ, రోజుని తన కాబోయే పతితో ప్రారంభించడం ఆమెకు అలవాటు.
కానీ, ఆరోజు కనీసం కారణం కూడా చెప్పకుండా పార్క్ కు రావటం ఎందుకు మానేసాడో తెలియక, ఏదైనా సమస్యేమో ఎలా కనుక్కోవడం అని ఆలోచనలతో సతమతమవుతూ ఉంది ఆమె.

పోనీ కాల్ చేద్దామంటే, వారి మధ్యలో అడ్డు అని ఉదయ వ్యాయామ సమయంలో మొబైల్స్ కూడా వెంట తెచ్చుకోకూడదని ముందే ఇద్దరూ షరతు పెట్టుకున్నాం. ఇప్పుడెలా? ఎవరినైనా అడుగుదామంటే మొహమాటం. సరే ఇంటికెళ్లి చూద్దాం అని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతుండగా రానేవచ్చాడు తన సఖుడు.

రాగానే తన ప్రేయసి మోము లోని అసహనాన్ని గమనించి, “రాత్రి అనుకోకుండా స్నేహితులు వచ్చారు. అందుకే ఉదయం మెలకువ రాలేదు” అని సంజాయిషీ ఇచ్చాడు. ఆమెకు కారణం సబబుగానే అనిపించినా సరదాగా కాసేపు బెట్టు చేయాలనిపించి, అలకగా మరొక వైపు తిరిగి నిల్చుంది. అతనికి విషయం అర్థమై నవ్వుకుని,” *వయ్యారాల జాబిలమ్మ అలిగిన వేళ* , అలకల కులుకుల నా చెలి సొగసులు చూచుటకు నా నయనాలు ఎంత అదృష్టం చేసుకున్నవో కదా” అంటూ కవిత్వం మొదలు పెట్టబోయాడు. వెంటనే “నీ పదాల మాయలో * ఉత్తరాన సూర్యుడు ఉలిక్కిపడేలా ఉన్నాడు* అంటూ కిల కిలా నవ్వేసింది….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!