అలకల జల్లు

అంశం :: వయ్యారాల జాబిలమ్మ అలిగినవేళ..
              ఉత్తరాన సూర్యుడు ఉలికి పడెనేల..

అలకల జల్లు

 

రచయిత:ఇత్నార్క్

ప్రేయసి చిలిపి సరసాలను 

అర్థం చేసుకోవడంలో విఫలమైన వేళ 

వయ్యారాల జాబిలమ్మ అలక కాస్త 

మధ్యాహ్నపు సూర్యరశ్మిలా మారుతున్న వేళ

ఉత్తరాన  హిమ పర్వతాలలో ఉన్న ప్రియుడు ఉలికి పడి 

హిమపాతం లాంటి తన ప్రేమనంత

తన ప్రేయసికి తన కౌగిట్లో  అందించినప్పుడు 

ప్రేయసి అలక జల్లు కాస్త ఆనంద జల్లులుగా మారిన వేళ

జాబిలమ్మ కూడా వెన్నెల చల్లదనానికి

తన ప్రేమ మాధుర్యాన్ని జత చేసి 

మధురమైన తన అధర అమృతాన్ని

ప్రియుడికి చెరిగిపోని తియ్యని జ్ఞాపకంగా అందించింది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!