మార్పు

అంశం ::వయ్యారాల జాబిలమ్మ అలిగినవేళ..

ఉత్తరాన సూర్యుడు ఉలికి పడెనేల.

మార్పు

రచయిత:నారు మంచి వాణి ప్రభాకరి

 

మహతి చాలా అందమైన అమ్మాయి. కంప్యూటర్ ఇంజినీర్ గా ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ తయారు చేస్తుంది భోజనం మాత్రం క్యాంటీన్ లో చేస్తుంది 

బ్రేక్ ఫాస్ట్ ఎంత బలంగా విటమిన్ ఫుడ్ తినడం మంచిది అందుకే దోసె కూర చపాతీ కూర పెసరట్టు ఉప్మా,గారే ,సాంబారు ఇలా చాలా రుచికరమైన వంటకం చేస్తుంది .సహజంగా వంట అంటే పరుగు పెట్టే వయస్సులో ఎంతో ఇష్టంగా వంటకాలు చేస్తుంది. ఆరోజు రాజేష్ ఈ మంచి హిందీ సినిమా పాతది వచ్చింది.జా ల్ న చిన్నప్పుడు చూసాను ఇప్పుడు మళ్లీ వచ్చింది టిక్కెట్ తెస్తాను రెడీ గా ఉండూ అన్నాడు.

రాజేష్ మాటలకి ఆశ్చర్య పోయింది మహతి ఎప్పుడు టైమ్ ప్రకారం పనులు చేస్తుంది .రాజేష్ ఎప్పుడు టైమ్ చూడడు ఎందుకు హడావిడి అంటూ తాయితిగా వెడతాడు . 

సరే ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి రెడ్ బోర్డర్ ఉన్న మీగడ రంగు చీర కట్టింది. మీగడ రంగు మెరిసే అద్దాల జాకెట్ వేసుకుంది. నిజానికి పూర్ణిమ చంద్రుడితో పోటీ పడుతున్నట్లు ఉంది దానికి తోడు ఆ రోజు పూర్ణిమ కూడా పుచ్చ పూల వెన్నెల వెలుగులు, బాల్కనీ అంతా పరుచుకుని ఉన్నాయి. మాలతి తీగ నుంచి సుగంధ పరిమళాలు మత్తు ఎక్కిస్తున్నయి టైమ్ దాటిపోతుంది కానీ రాజేష్ రాలేదు. విసుగు వచ్చింది అటునుంచి అటు హోటల్ భోజనం ప్లాన్ వంట చెయ్యి లేదు. ఓ ప్రక్క ఆకలి వేస్తోంది .డబ్బాలో అమ్మ పంపిన జంతికలు ఉన్నాయి అవి తీసుకుని తిన్నది అయినా రాజేష్ రాలేదు ఫోన్చేస్తే బిజీ బిజీ అనివస్తోంది. 

అలా కుర్చీలో కూర్చుని చంద్రుడి అందాలు పరిశీలిస్తోంది.  గేటు చప్పుడు వినిపించింది. ఆతరువాత స్కూటర్ అగిన శబ్దం విని పించిది .రాజేష్ వచ్చాడు తను బెట్టు చెయ్యాలి అనుకుంది. 

కాలింగ్ బెల్ మోగింది కానీ మహతి వచ్చి తలుపు తియ్యి లేదు రాజేశ్ కి విషయం అర్థం అయింది  . ఫోన్ చేసి నీకు నచ్చిన సారీ తెచ్చాను. ఓ షాప్ ఓపెనింగ్ కి చాలా ఆఫర్స్ పెట్టారు ఆఫీస్ కి వచ్చి పిలిచారు తలుపు తియ్యి నీ అందాల మోము అలిగిన వేళ  నువ్వు వయ్యారాలు జాబిలమ్మ తో.పోటీ పడుతున్నారు అర్థం అయింది బంగారం అంటూ ఫోన్ లోనే సారీ చెప్పాడు. 

మహతి ఆ మాటలకు మురిసి ముక్కలై పోయి ముత్యాల హరం లా మెరిసి పోతు వచ్చి తలుపు తీసింది. హమ్మయ్య ఇప్పటికీ తలుపు తీసి నందుకు ధన్య వాదాలు .అంటూ చీర ప్యాకెట్ చేతిలో పెట్టీ సినిమా టికెట్స్ చేతిలో పెట్టాడు 

విచిత్రం ! ఎప్పుడు ఎన్ని సార్లు చీర అడిగిన తెని భర్త చీర తెచ్చేటప్పటికి ఐస్ అయిపోయింది. కొంచెం తెప్పరిల్లి ఏమిటి ఈ రోజు ఉదయం సూర్యుడు ఉలికి పడలేదు కదా ఆంది.

అవును అవును ముందు బయలు దేరి హోటల్కి వెళ్లి భోజనం చేసి సెకండ్ షోకి వేడదాము .రేపు ఎలా ఓటు వెయ్యాలి , సెలవు అని మార్చి పోయావా అని నవ్వుతూ ఇంటికి తాళం వేసి స్కూటర్ స్టార్ట్ చేశాడు . నా నాటి బ్రతుకు నాటకంలో పతి దేముడిని అనుసరించాలి కదా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!