అలకా.. ఆలోచించు.

అంశం : వయ్యారాల జాబిలమ్మ అలిగినవేళ..
             ఉత్తరాన సూర్యుడు ఉలికి పడెనేల..

అలకా.. ఆలోచించు.

రచయిత: బుజ్జమ్మ

 

నే భామయై అలకబూనిన వేళ..

నా పతి అలక తీర్చు వేళ…..

“వయ్యారాల జాబిలమ్మ అలిగిన వేళ..

ఆ చందురుని మదిలో కూడా కలిగేనేమో అలజడి.

ఇక నేనెంతటి వాడిని సఖి.. 

నీ అలకల కులుకుల ముందర..” అనుచూ.. 

వంటింట నా వెనుకే తిరుగుచూ.. 

పతిదేవుడు నా అలక తిర్చుచుండ..

లోలోన ఒకింత గర్వపడుతూ..

మోమును తిప్పిన నాకు.. 

కిటికీ పై కానవచ్చే సర్పరాజము..

 

నా అలకలు అటకెక్కగా.. ఆలోచించక నే

చేతిన ఉన్న కారము తీసి.. 

పాముపై విసరగా..

అలక తీర్చ నా పతి అటుగా వచ్చిన వేళ..

తన మోము అస్తమించే రవి వలే..

రుద్ర వర్ణముగా మారిన వేళ

ఉత్తరాన సూర్యుడు ఉలికి పడినట్లుగా..

నా మది కలవర పడినది.. 

తదుపరి.. అందరితో తిట్లు పడినవి..

ఈ వయ్యారాల జాబిలమ్మ.. వగలన్నీ..

తన పతిదేవుని కోపాగ్నికి ఆహుతైనవి.

 

సతి అలకబూనిన వేళ పతియే కాదు.. 

సతి కూడా ఒకింత జాగరూకతతో ఉండాలని తెలుసుకుంటిని.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!