ప్రేమ జావళి

అంశం :: వయ్యారాల జాబిలమ్మ అలిగినవేళ..
             ఉత్తరాన సూర్యుడు ఉలికి పడెనేల..

 ప్రేమ జావళి

 

రచయిత:విజయ మలవతు

 

ఆమని పాటతో మేలుకున్న

మనస్సులో కలుగుతున్న అలజడికి 

కరిగిన మంచు బిందువుల జడిలో 

మది తడిసి ముద్దవుతూ..

 

ఉషస్సు రేపుతున్న సందడితో 

మెల్లగా తూరుపు తెర చాటున 

తొంగి చూస్తున్న నునులేత సూర్యుని 

కిరణాలలో మనసే తేలుతూ..

 

పున్నమిలో మెరిసే జాబిల్లితో ఆటలాడుతూ 

అంతలో చిరుకోపం చిందిస్తూ..

చిలిపి అల్లరితో మైమరిపిస్తూ లోలోన దాగిన

ప్రేమ జావళిలే జన్మ జన్మల నీతోడుగా …

 

చిరునగవుల సాక్షిగా మన ప్రేమ నిక్కము సఖి

నువ్వెంతెంత ఉలికి పడినా 

ఉత్తరాన సూర్యుడు ఉదయించినా

నిజమైన ప్రేమ ఎప్పటికి ఓడిపోదులే..

అది మన ప్రేమేనని గర్వంగా చెప్పనా చెలీ…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!