స్వాగతం యుగారంభానికి

స్వాగతం యుగారంభానికి

విన్నాను నేను…
కోకిల కుహు కుహూల పిలుపు.

చేరింది మదికి…
వసంతాగమన తలపు.

కాంచనేలేదే ప్రకృతి
కమనీయ పలకరింపు…
ఎదలో కలిగే పులకరింపు.

అంతటి యాంత్రికతతో
అలసితినా?
అలసి సొలసితినా?
యుగారంభ యుగాదినే
మరచితినా?

పిందేసిన మామిడి…
పలకరించి పరిహాసమాడింది.
విరబూసిన వేప…
కుశలమడిగి మురిసింది. 

తటాలున లేచి
తరచి చూశా ప్రకృతిని.
వాసంత సమీరం
అలవోకగా నను తాకింది.

ఎద మయూరమైంది.
మానసం ఉల్లాసంగా
ఉరికింది…
షడ్రుచుల సంగమం
సంస్కృతి సంరంభం
యుగ ఆరంభం
ఉగాదికి
పలికేందుకు స్వాగతం.

      రచన – ఫణికిరణ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!