రంగుల హరివిల్లు 

రంగుల హరివిల్లు 

లేతలేత బుగ్గల కన్నెపిల్ల సిగ్గులా

విరిసే గులబీరంగుల సొగసులు.

విచ్చుకునే ఎర్రని పెదవులపై

వికసించే తెల్లని మల్లెపువ్వుల నవ్వులు.

 

స్వచమైన ప్రకృతి రంగులతో

పచ్చనైన సింగారాల పట్టుచీరను

నల్లని నిశీది కాటుకగా పెట్టుకొన్నది

ఆ వన్నెల చిన్నది.

 

పుత్తడి పట్టీలు పెట్టి గలగలమని నడుస్తూ 

పసుపు నీళ్లు చేతపట్టి, మనసు పడ్డ మగాడికై

పరుగులు తీస్తూ హోళీ పండుగ సంబరాలకు

శ్రీకారం చుట్టే కన్నెపిల్లలు సందడి.

 

పదహారువేల మంది గోపికలతో 

ఆ బృందావనమే నందనవనమాయే 

రాధాకృష్ణ ప్రేమామృతంతో…  

అన్ని రంగులు కలసి హరివిల్లై విరిసెను గా ఆకాశంలో.

                                                                                                                      రచయిత:: ప్రశాంతి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!