రంగుల ప్రపంచంలో
పచ్చని పైరుని చీరగా కట్టి
ప్రకృతి కళగా కనిపించిన వేళ,
నన్ను తాకిన తెల్లని చంద్రుడి చూపుతో,
నా బుగ్గలు మారే ఎర్రని మందారంలా…
నీలం పువ్వుల తోటలో
దోబూచులాడుతున్న వేళ
మగని అల్లరి ఆటలన్నీ
నన్ను చేరే చుక్కల మెరుపుల్లా..
నల్లని మట్టిని చిరుకోపంతో
సఖునికి నే పూసిన వేళ..
ప్రకృతిలోని పచ్చని తీగలే
నన్ను మెత్తగా తాకెనే అలా…
కాటుక దిద్దని నా కన్నుల్లో
చెలికాడి మోహన రూపం నిలిచిన వేళ..
లేత గులాబీల రంగులు
నా బుగ్గల పై సిగ్గుల వర్షం
నిలిచేనెందుకో ఇలా..
నా మనసేమో తన ప్రేమలో
చిలిపి అల్లర్లతో నిండిన వేళ..
నా జీవనమంతా ఆ రంగులలో
ప్రతి క్షణం ఆనందాలలో తడిచె చూడ
రచయిత:కొఠారు నాగ సాయి అనూష..