కాటేసే కాలం
విధాత పెన్నులో
విషపు సిరా
కువలయాన క్రమ్మెను
కరోనా పొర!
కొంటె గీతల కోతి గీత
నొసటిపై తన చేతిరాత
వెతల చితిని బతుకు చితికె!
లోకమంతా రోగమాయే
జగతి జాతే జాడ్యమాయే
కరుణలేని కాలం
కరాళ కోరలతో కాటేస్తోంది!!
రక్తమింకిన ఇంకు ని
ఇకనైనా మార్చుకో
ఓ మొదటి వేలుపా!!
రచయిత: సి.శ్రీ.