సదాశివా నీకై కైమోడ్పులు

రచన – విజయమలవతు

ప్రాణమైతే పోసావు గాని
మంచి జ్ఞానమే ఇవ్వటం
మరిచితివా సదాశివా..

మంచిగంధం సువాసన తెలుసు గానీ
నువ్వు పూసుకునే
చితా భస్మం వాసన
మేమెరుగమే సదాశివా..

పుర్రెకో బుద్ధి ఎరుగుదుము గానీ
పుర్రె లేకుంటే బ్రతుకు లేదని తెలుసే
నీలా పుర్రె లో భుజించటానికి
జంకుతామే సదాశివా..

త్రినేత్రదారునివైన నీకే
నేత్ర దానం చేసే వారున్నారే
ప్రాణం పోయాక కూడా నయన దానం
చేయ మనసే రావటం లేదే సదాశివా…

ప్రళయకాల రుద్రుడివై తాండవం ఆడే నీవు
మమ్ము కూడా నీ జ్ఞాన తాండవంలో
భాగస్వాములను చేసి సన్మార్గానికై
దారి చూపరాదా సదాశివా…

కంఠాన విషమెంత ఉన్ననేమి
దేహంలో సగభాగం అర్ధాంగికిచ్చిన నీవు
ఇల్లాలు అర్ధభాగమని చెప్పినా
నీ ఆటలో భాగమే అనుకుంటున్నాం సదాశివా….

కైలాసగిరి నీ నివాసమైనా స్మశానమే
నా ఇల్లు అనే నీవు మిద్దెలు మేడలు ఉన్నా
చివరకు ఆరడుగుల నేల ఇచటనే అన్నా
వ్యామోహం తగ్గలేదే సదాశివా..

మంజునాధా నీ ఆటలు ఎన్ని చూపినా
అర్థం చేసుకోలేని మూర్ఖులమే మేమయ్యా
అయినా నీ బిడ్డల తప్పు కాయవయ్యా
ఇవే సదాశివా నీకై కైమోడ్పులు ..

You May Also Like

6 thoughts on “సదాశివా నీకై కైమోడ్పులు

  1. లయాకరుడికి అక్షర నివేదన 🙏🍃…
    చాలా బాగుంది మేడం 👏

  2. 🙏🙏🙏
    లయకారుడుకి అక్షర నివేదన అద్భుతం గా ఉంది మేడం 👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!