శివోహం

రచన – జయ

బొమ్మలు చేసి,ఆటబొమ్మలు చేసి
ఆటలేల శివయ్య..ఈ లీలలు ఏల!శివయ్యా

గంగ పొంగును ఆపగల జఠాధరుడివే..
నా కనులలో పొంగుతున్న జలధారకు
విముక్తి ఎప్పటికి శివయ్యా

కంఠంలో గరళాన్ని దాచిన గరళకంఠుడా..
నా గుండెల్లో భారాన్ని దించేది ఏనాటికయ్యా

చెడుని భస్మం చేసే త్రినేత్రుడా..
మాలో స్వార్ధాన్ని భస్మం చేసేది ఎప్పుడయ్యా

విధాతవైన విశ్వనాథుడివే..
ఈ విశ్వంలోని వింత జాడ్యాలకు
విముక్తి ప్రసాదించేది ఎన్నడయ్యా

ఆ శశినే శిరస్సున ధరించిన శశిధరుడివే..
మా చీకటి బ్రతుకుల్లో..
వెన్నెల నింపేది ఏనాటికయ్యా..

సతి పార్వతికి అర్థనారీశ్వరుడవై..
నాగాభరణుడివై..
గుడిలో శివలింగమై..
ఆత్మలో ఆత్మలింగమై..

జగాలను ఏలే జంగముడై..
త్రిలోక పూజ్యుడై..
త్రిశూలదారుడివై..
పంచభూతాలకు అధిపతివైన పరమేశ్వరా..
ఈ బంధాల చెర నుండి నను విడిపించి..
చెప్పనలవి కాని ఆనందాన్ని నాకు ప్రసాదించి..
ఈ బొమ్మను..నీ సన్నిధికి చేర్చుకునేది
ఎప్పుడయ్యా..భోళాశంకరా.

******

You May Also Like

4 thoughts on “శివోహం

  1. ఎంత చక్కగా చెప్పారు శివోహం అంటూ భక్తి భావనలో ముంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!