మన ఇంటి ఉగాది
ఇంద్ర ధనుస్సు వంటి ముగ్గులతో…
పచ్చ పచ్చటి తోరణాలతో…
మమతానురాగాలకు నిలయంగా…
తెలుగింటి ఆడబడుచుల ఆకాంక్షలతో…
షడ్రుచుల అభిరుచులతో…
రూపు లేని రేపు కొరకు ఆశల తలపులతో…
తీపి, చేదు కలిసిందే జీవితం అనీ…
కష్టం, సుఖం తెలిసిందే జీవితం అనీ…
రూపు లేని రేపటి మంచి కొరకు ఆశిస్తూ…
ప్లవనామ సంవత్సరానికి శ్రీకారం చుడుతూ…
మన జీవితాలలో ఆనందోత్సాహాలు
పూయించేందుకు వస్తుంది ఈ “ఉగాది పర్వదినం”.
రచన: కావ్యశ్రీ