మన ఉగాది….
ఉగాది తెలుగు సంవత్సరాది
సాంప్రదాయక మేళవింపు
పంచేంద్రియాలకు పులకరింపు
రంగురంగుల పూలు కళ్ళకు ఇంపు
కోయిలమ్మ పాటలు చెవులకు ఇంపు
వేప, మామిడి పూతల సువాసన ముక్కుకు ఇంపు
షడ్రుచుల ఉగాది పచ్చడి రుచి నాలుకకు ఇంపు
శిశిరం దాటిన వసంత గాలులు మేనికి పరవశం
జీవనాడులను పులకింపచేసే
సాటి లేని మేటి కలయిక మన ఉగాది
రచన: మహేశ్వరి