కాటేసే కాలాన్ని మార్చాలి

కాటేసే కాలాన్ని మార్చాలి

కాటేసే కాలం
మనుషుల మాటున దాగిన మానవ మృగాలు
కన్ను మిన్నుగానక కాటేస్తున్నాయి ఆడబిడ్డలను

తరాలు మారినా తీరని వ్యథ తన్విది

అతివలంటే అబలలు కాదు సబలలు అన్నారు

మగువల రక్షణకై నిర్భయ,దిశా అంటూ చట్టాలెన్నో చేశారు

అయినా ఆగలేదు అకృత్యాల పర్వం

ఆకాశయానం చేయగల సత్తా ఉన్న అంగనకైనా

అర్ధరాత్రి నడిరోడ్డుపై పయనించాలంటే భయమే

ఏ మృగాడి కాటుకి బలై కాలగర్భంలో కలిసిపోవాల్సొస్తుందో అన్న అనుమానమే

పసిపాప నుంచి పండు ముదుసలి వరకు ఏ భయానకి లేదు అభయము

ఈ రక్కసి మూకల కాటేసే కాలం సమసిపోవాలి

ముదితలే అందుకు శ్రీకారం చుట్టాలి

తల్లులే తమ బిడ్డలను తగురీతిగా తీర్చిదిద్దుతూ

సమాజంలోని చెడుని ఎండగడుతూ

ఈ కాటేసే కాలాన్ని మార్చాలి

నవ సమాజానికి పునాదులు వేయాలి

రచయిత :: ఎస్.నాగమయూరి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!