అనుభవసారం

అనుభవసారం

ఎన్నో సంవత్సరాల అనుబంధం ఏనాడో ముడిపడిన ఈ బంధం.
కన్నీళ్ళలో తోడు ఉంది అనురాగం
సంతోషాల సుగంధం ఈ ఆనందం.

ఉత్సాహం మదిని మీటుతుంది
ఉల్లాసం మదిలో రాగమాలపిస్తోంది
నీవు జీవితంలో నాతో ఉండగా..
నా మనసు నీ జతలో పులకిస్తోంది.

ఇన్నేళ్ల మన సాహవాసంలో
ఎదో తెలియని ఆనందంలో
భాద్యతలను, భందాలను
చెరి సగం పంచుకున్నాము.

పాలు నీళ్ల లాగా,
కన్నీళ్లలో కష్టాలలో,
నీకు నేను.. నాకు నువ్వు అంటూ
జీవితంలోని యాభై ఏళ్ళు పయనించాము.

మిగిలినది జీవిత శేషం,
నువ్వు ఉండాలి నా కోసం
ప్రయాణం సాగించాలి మన కోసం,
తీరని కోరికలు వైపు సాగాలి మన పయనం….ఇకనైనా….

రచయిత:: పి. వి. యన్. కృష్ణవేణి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!