బ్రతకడం కాదు… జీవించాలి

బ్రతకడం కాదు… జీవించాలి

కుటుంబ బరువు బాధ్యతలతో…
దైనందిన కార్యక్రమాలతో…
వృత్తి ఉద్యోగాలతో…
విరామం లేక…
సమయం దొరకక…
అంతరంగంలో అట్టడుగుకి తోసిన
అభిరుచులు…
ఇష్టమైన వ్యాపకాలు…
తీరని కోరికలు…
నిజం చేసుకోవాలకున్న కలలు…
రెక్కలు విప్పుకున్న విహంగాలై ఎగిరే…
ఆశల రేకులు విప్పుకున్న సుమాలై విరిసే…
యాభై ఏళ్ళ వయసు…!

ఆరోగ్య స్పృహ కలిగి…
ఆశావాదం తోడుగా…
హేతువాదం జోడుగా…
ఆత్మవిశ్వాసపు పాదరక్షలు ధరించి…
ఆత్మస్థైర్యంతో జీవిత పయనం
సాగించాలి…!

ఎంతకాలం బ్రతికామన్నది కాక…
జీవించినంతకాలం…
చేతుల్లో ఉన్నది చేతల్లో చూపుతూ…
చేతనైన పరోపకారం చేస్తూ…
మానవత్వ పరిమళాలు వెదజల్లుతూ…
శేష జీవితాన్ని బ్రతకడం కాక…
జీవించాలి…
మానవ జన్మకు సార్థకతను కలిగించాలి…!!!

రచయిత::చంద్రకళ. దీకొండ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!