రంగుల జాతర

రంగుల జాతర…

హోళీతో రంగులే మురవగా

ఇంటి ముంగిలి సంతోషమై 

హొలీ ఆటతో సంబరమేపడగా

ఇంద్రధనస్సులో ఏడు రంగులతో

ముంగిట ముచ్చటగా రంగుల పండగ…

 

పచ్చని పసిరికలతో పంట చేలల్లో మురిసి 

ప్రియతముల ఆనందాల హేళలో 

చిన్న పెద్ద తేడా లేకుండా

అందరూ భాగస్వాములై చిందులేయగా..

 

ఉట్టినే కొట్టే మొనగాడిని చూడ పడుచులే ముందుండురే

గెలిచిన వాడి పై మనసే పడుదురే

ఆనందాల రంగుల జాతరలో 

మంది మురిసి ఆడి పాడుదురే..

 

ఈ పండుగలో మనసిచ్చిన మగువ 

అందమైన చెంప పై సరస్వతి రంగు పూయ..

మది మెచ్చిన మగువ అధరాలపై

గులాబీ రంగు వికశించగా..

 

ఆ రంగులలో తడిసి ముద్దై 

ఆనందాల హేళ ఈ రమ్యమైన హోళీ రే….

                                  రచయిత:: విజయ మలవతు

You May Also Like

5 thoughts on “రంగుల జాతర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!