బంధమే అజరామరం

బంధమే అజరామరం

‘అండాండంలో ఏదుందో పిండాండంలో అదే ఉంది’ అంటుంది ఓ మామ్మ!

‘నిజమో ఏమో’ అన్నట్టు
వాగులు నదులు ఎన్ని
గులాబీలు పూయించినా
ఎన్ని వరినాట్లలో దూరినా
కదిలి కదిలి వయ్యారాలతో
వంకరలు తిరుగుతూ
కడలి పురుషుడి కౌగిట్లోకే
చేరతాయి.
ఏ తృప్తి కమ్ముతుందో
ఏ మైకం ఆవరిస్తుందో
మనసా వాచా కలిసి‌న
కలయికలో నదేదో, కడలేదో తెలీనే తెలీదు.

అల్లరి చిల్లరి బాల్యంలో
నాన్న దగ్గర అలిగి, అమ్మ
దగ్గిర గారాలు పోయే అమ్మాయి, స్నేహితురాళ్ళతో సై అని
పందెం కట్టే దమ్మున్న పడతి,
మూడుముళ్ళ బంధంతో తగని సిగ్గుతో
పాలగ్లాసు చేతిలో ఉంచుకుని పతి చెంతకి
చేరుతుంది! ఆ రోజే చూసినా,
ఆ బంధం జన్మ జన్మలదే అని నమ్ముతుంది.
ప్రకృతికీ స్త్రీకీ పురుషుడికీ మధ్య బంధమే మధురం అజరామరం

రచయిత::మంగు క్రిష్ణకుమారి

You May Also Like

2 thoughts on “బంధమే అజరామరం

  1. జన్మ జన్మల బంధాన్ని చక్కగా పోల్చారండీ👌👌💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!