నాన్న చూపిన బాట
రచయిత:వర్ధన్
మోస్తున్నా నాన్న నీ జ్ఞాపకాల్ని గుండెలోన,
నెమరువేస్తున్నా నాన్న,
నీకు నాకు మధ్య ఉన్న తిరిగి రాని బంధాన్ని,
కోరుకున్నా నీ కోరికలన్నీ తీరాలని,
నీకు ఆ దేవుడు నూరేళ్ళ ఆయుష్షుని ఇవ్వాలని
నా కోరికలో లోపమో, లేక ఇది ఏ జన్మలో శాపమో
నువ్వు లేని శేష జీవితాన్ని భారంగా మోస్తున్నా
నువ్వు చూపిన లోకంలో
నువ్వు నడిచిన మార్గంలో
నువ్వు గడిపిన కార్యంలో
నీ బాధ్యతలను నాకు అప్ప చెప్పి వెళ్ళావు
నువ్వు ఉండగా తీరని నీ తపన
నీ లోటులో నాకు బాట అయ్యింది.
నువ్వు ఆవిరై నాకు వెలుతురునిచ్చావు.
నువ్వు లేవని, రావని చేదు నిజం అబద్ధం కాకున్నా
అబద్ధం కావాలని కోరుకున్నా
తీరని కోరిక అని తెలిసిన కోరుకుంటున్నా..
Heart touching lines vardhan..🙏🙏