సంవత్సరాది

సంవత్సరాది

సృష్టి ఆరంభానికి నాంది పలికిన రోజే

యుగానికే ఆదిగా జరుపుకునే ఈ పండుగ

కాల దర్పణంలా పోయినేడు మలచుకున్న

ప్రణాళికల లెక్కలు చూసుకునే మొదటి రోజు…

 

ఉత్తరాయణ పుణ్యకాలంలో

వసంత ఋతు ఆగమనంలో

చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి నాడు

బ్రాహ్మి ముహూర్తంలో సృష్టి నాందికి సూచనగా..

 

‘ఉ’ అంటే నక్షత్రం

‘గా’ అంటే గమనం 

‘ది’ అంటే ఆచరణం

ఉగాది నక్షత్ర గమనాన్ని ఆచరించడం

సంవత్సరాది…

 

కొత్త ధాన్యాల వాడకం మొదలు ఉగాదేగా..

నూతన ఉత్సాహాలకు నాంది పలికే ఉగాదిగా..

 

బెల్లంలోని తియ్యదనం

చింతలోని పులుపుదనం

వేప పువ్వు లోని చేదుదనం

మామిళ్లలోని వగరుదనం

ఘాటైన కారానికి విరుగుడుగా

అమృతసమానమైన నెయ్యిలోని కమ్మదననానికి కలిపి…

జీవితం షడ్రుచుల సమ్మేళన ఆస్వాధనలే 

తెలిపే ఉగాది…

 

ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ..

                    రచన: విజయ మలవతు

You May Also Like

One thought on “సంవత్సరాది

  1. చాలా బాగా చెప్పారు…
    మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు అండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!