కొత్త చిగురు ఉగాది 

కొత్త చిగురు ఉగాది 

కొత్త చిగురు తొడుక్కున్న పుడమి తల్లి

 పచ్చదనాన్ని నింపుకుని వసంతమై విరిసెనులే

 కొత్త కొత్త ఊహలు అన్ని కలిసి

 పసిడి  జీవితానికి శ్రీకారం పలికిన నూతన

యుగమే ఉగాది.

 గడిచిన కాలంలోని చేదు తొలగిస్తూ

 కోపతాపాల కారాన్ని కలగలిసిన రోజులన్నీ మరిచిపోతూ

 గతంలోని తీపి జ్ఞాపకాలు పునాది వేస్తూ

 కొంగొత్త రుచులను కలగలిపి షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి.

 వాడిపోయిన రెమ్మలను విడిచిన వృక్షమా

 చిగురించే పచ్చని ఆకులు తొడుక్కుని

 వాలిపోయిన తన శరీరానికి కొత్త అందాలు

 చిగురు వేసుకుంది.

 మత్స్యకారునిగా నారాయణుడు

 వేదాల రక్షణలో సోమకుని అనే చెడును సంహరించి

 మాయలు లేని బ్రహ్మ సృష్టికి వేదలను రక్షణ కవచంగా

నిలిపి కాలగమనానికి నాంది పలికేను

ఆరు ఋతువుల నక్షత్ర గమనానికి పునాది వేసి

మనకు ఉగాదిగా అందించేను ఆ ఆది నారాయణుడు.

రచన: చలిమేడ ప్రశాంతి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!