ఈ యుగాది
సృష్టికి ఆరంభ సంకేతము!
షడ్రుచుల సమ్మేళనం!!
నక్షత్రగమనమై,జన్మ,ఆయుష్షు పెంచే
ప్రథమ దినము ఈ యుగాది!!
సోమకుడు తస్కరించిన
ఆ “వేద” భాండాగారముకై
తల్లడిల్లెనులే సృష్టి కర్త!!
నారాయణుడే అభయమిచ్చి “మీనమై”
సాగరమున రణరంగమున జయుడై, విజయుడై బ్రహ్మ కొసగే!!
గానగాంధర్వమే చిన్నబోయే కోయిల రాగధ్వనితో!!
కష్ట, సుఖములు వడపోత “వసంత”ఋతువుల చిగురుల కలనేత!!
చిత్రంగా చైత్రమే తీసుకువచ్చే,
ఆనందాల అనుభూతుల హేళ!!
“శార్వరి” నిద్రపుచ్చుతూ
“ప్లవ”ని మేల్కొపుతూ…
ప్రతిదినము శుభమునుకు “సోపానమై”
వర్దిల్లును ఈ జనావని!!
రచన: దీప్తి
Super.. మా… Happy ugadi