జ్ఞాపకాల కాలం

జ్ఞాపకాల కాలం

ఆనందాలతో సాగే జీవనం ఒకే ఒక
అలజడితో తలక్రిందులుగా చేసిందే..
నిందలెన్ని పడ్డా నువ్వున్నావన్న
సంతోషం లేకుండా …

కాలం తీసుకున్న దయలేని నిర్ణయానికి తలవంచి నిర్ణయం…
నీకు నీవుగా తీసుకొని…
కన్నీటి సంద్రంలో వదిలెళ్లి నీ దారి నీదంటూ..

ప్రాణాలు పెట్టుకున్న మనసులనే నిర్ధాక్షిణ్యంగా కాలదన్ని
ఏమి సాధించావో ఈ పయనంలో
ఎన్నాళ్ళైనా కాలం కాటేసిందని
కంఠం దాటాని గరాళాన్ని మింగలేక నిలుచున్నా..

ఏమి సాధించావో మా గడిచే కాలంలో
నీ సెలవుతో ..కలగా మిగిలిన నీ అవశేష జ్ఞాపకాలలో…
నిజముగా ఉన్నావని ఆనందించాలా..

కాలం కాటేసిన జీవితంలో
నీ తలపే ఒక ప్రేమ భావం..
ప్రేమ జ్ఞాపకం..తనువుతో పోటీ పడుతున్న మనసుతో
నీకై చేరే చివరిక్షణంకై నా నిరీక్షణ…

రచయిత :: విజయ మలవతు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!