జీవితగమనం

జీవితగమనం

అణువై తల్లి గర్భంలో ప్రవేశించింది మొదలు.
ప్రతిదశ లోను అలుపెరుగక పోరాడటమే జీవనగమనం..

ఆటలు,పాటలు,గిల్లికజ్జాల.. బాల్యం..

మనస్సును పెనవేసుకున్న ప్రేమ..
మధురస్మృతులుగా గుండె గూటిలో పదిలంగా ఉండే తొలిప్రాయపు తీపిగుర్తులు.

భార్యాభర్తలుగా ఒకరి అడుగులో ఒకరు అడుగులు వేస్తూ.
తోడు నీడగా కుటుంభాన్ని ఒక్కతాటిపై నడిపించే నూరేళ్ళ బంధం..

తల్లి,తండ్రులు గా తమ ప్రేమ,ఆప్యాతలను పంచుతూ.
మంచి విలువలు నేర్పుతూ..
వారి బంగారు భవిష్యత్తుకు
బాటలు వేసే మార్గదర్శకులు.

వారి అనుభవాల సమాహారం గా మలచి..
సలహాలు సూచనలు ఇస్తూ ..
సమాజాభివృద్ధి లో తమ వంతు
చేయూతనిచ్చే పెద్దరికం..

ఇలా ఆటుపోట్ల జీవిత సాగరాన్ని ఈదుతూ
యాభైయేళ్ళ వసంతం లోకి అడుగిడిన
మన ప్రత్యక్ష దైవాలు శత వసంతాలు మించి
చవిచూడాలని ఆశిస్తున్నా…🙏

రచయిత::జయకుమారి

You May Also Like

One thought on “జీవితగమనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!