50 కొత్త 30
50 కొత్త 30 అనే వైఖరిని కలిగి
గతంలోని వైభవాలను స్మృతించుకుంటూ
అనుభవాలను పాఠాలుగా
వైఫల్యాలను తీర్చిదిద్దుకుంటూ
అనుభవ పూరితమైన మనస్సుతో
నెమ్మదైన వయస్సుతో
ఆహ్లాదకరంగా సాగుతూ
కమ్మని కలలని
నింపాదిగా సాధిస్తూ
వసంత కాలంలా
పరుగులు పెట్టే
నా తరువాతి తరానికి అందిస్తూ
నిత్య నూతనంగా ఉంటాను
రచయిత:: రాధ ఓడూరి