ప్రకృతి – స్త్రీ సరసం
ఆమె మొహాల ఉయ్యాలలో
ఊగే దేహాలే కరిగే కాలాలు
కన్నె గుండెలో కొసరి కొసరి కోరికలే పగలు
సృష్టి రహస్యాన్ని ఛేదించిన తనువుల కోరికలే రాత్రులు
ఉకపోతపొసే వేడిగాలులన్ని
ఆమె చిర్రుబుర్రలే
లతలు తొడిగిన కొమ్మలన్ని
చనువిచ్చిన సరసాలే
మెచ్చిచెప్పిన ఊసులన్నీ పచ్చిక బయల్లే
ఆమె అలకల కులుకులన్ని రంగుల ఋతువులే
ఝగన సీమంతా గగన సీమే
పచ్చ పచ్చని వనాలన్ని ఆమె అరటిబొదలు
వన్నెల ప్రాయంతో కులుకే కులుకులన్నీ
ఇంద్రధనస్సు రంగులు
కరుణతో కురిసే వానజల్లులన్నీ
ఆమె వలపామృతాలు
తుమ్మెదలకి మత్తెక్కించే మకరందాలే
ఆమె దేహ పరిమళాలు
రతికేళి కై ఉసిగోలిపే సమ్మోహన మంత్రాలు
ఆమె నులు సిగ్గుల బుగ్గల ఎర్రదనాలే
తాంబూలంలా పండిన సాయంత్రాలు
తియ్యని తేనెలు పారే సెలయేరులే
ఆమె నడుమోంపులు
మోడూబారిన చెట్లను ముద్దాడే వసంతమే
ఆమెలోని శృంగార భావము
సూర్యుని వెచ్చని కిరణాల వంటి
ఆమె స్థన్యాలు
ఆ నల్లని చూచుకములు పారిజాతంపై
వాలిన తుమ్మెదలు
సముద్రం పై ప్రేమ సంతకం చేసే వెన్నెలలా
ఎంత విశాలామో ఆమె వెనుక భాగం
ఇచ్చా కచ్చాలతో సరసమాడుకోవడానికి….
రచయిత :: ఉదయగిరి దస్తగిరి